- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీసీ అవార్డు రేసులో గిల్.. స్టోక్స్‌తో పోటీ
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. జూలై నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ అతన్ని నామినేట్ చేసింది. అవార్డు నామినీలను ఐసీసీ బుధవారం వెల్లడించింది. అవార్డు కోసం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌లతో గిల్ పోటీపడనున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో గిల్ అదరగొట్టాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఆకట్టుకున్నాడు. గిల్ కెప్టెన్సీలో భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-2తో ముగించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా కాదు ప్లేయర్‌గానూ సత్తాచాటాడు. 5 టెస్టుల్లో 754 రన్స్ చేసి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలవడంతోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు.
అయితే, ఈ సిరీస్‌లో జూలైలోనే మూడు టెస్టులు ఆడిన అతను 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. అందులో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(269) చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం(161) బాదాడు. ఇక, నాలుగో టెస్టులో మరో శతకం కొట్టాడు. గిల్ అసాధారణ ప్రదర్శనను ఐసీసీ గుర్తిస్తూ మంత్లీ అవార్డుకు నామినేట్ చేసింది. ఈ అవార్డు గెలిస్తే గిల్‌కు ఇది నాలుగో మంత్లీ అవార్డు అవుతుంది. ఇంతకుముందు 2023లో జనవరిలో, సెప్టెంబర్‌లో, ఈ ఏడాది ఫిబ్రవరి నెలకుగానూ మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. మరోవైపు, మహిళల విభాగంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లోస్టోన్, ఐర్లాండ్ బ్యాటర్ గాబీ లూయిస్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.






