- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్దిక్ పాండ్యాకు ఎదురు దెబ్బ.. గిల్ కు మరో ప్రమోషన్!
హార్దిక్ పాండ్యా కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందట బిసిసిఐ. అదే సమయంలో గిల్ కు మరోసారి ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

దిశ, వెబ్ డెస్క్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు రెండు ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో... వాళ్ల స్థానంలో మిగతా ప్లేయర్లను ఎలా భర్తీ చేయాలన్న దానిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి చాలా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హార్దిక్ పాండ్యా కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందట బిసిసిఐ. అదే సమయంలో గిల్ కు మరోసారి ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే టెస్ట్ టీంకు కెప్టెన్ గా గిల్ ను బీసీసీఐ ప్రకటించింది. వైస్ కెప్టెన్ గా పంత్ కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసి వైస్ కెప్టెన్సీని గిల్ కు అప్పగించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం టి20 కెప్టెన్ గా సూర్యకుమార్ కొనసాగుతున్నాడు. అతడు అందుబాటులో లేనప్పుడు హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ ఇస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం టి20 వైస్ కెప్టెన్ గా గిల్ కు అవకాశాలు ఇవ్వాలని... అధికారులు అనుకుంటున్నారట. ఆ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే... గిల్ కు కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తున్నారట. భవిష్యత్తులో... మూడు ఫార్మాట్స్ కు కూడా గిల్ ను కెప్టెన్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ఒక్కొక్క అడుగు బీసీసీఐ వేస్తున్నట్లు చెబుతున్నారు.






