హాంకాంగ్ జ‌ట్టుకు గిల్ భారీ సాయం..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

హాంకాంగ్ కు సాయం చేశాడు గిల్. హాంకాంగ్ ప్లేయ‌ర్ల‌కు త‌న బ్యాటింగ్ టెక్నిక్స్ చెబుతూ....వాళ్ల‌కు ట్రైనింగ్ ఇచ్చాడు గిల్‌.

హాంకాంగ్ జ‌ట్టుకు గిల్ భారీ సాయం..వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా దుబాయ్ లో టీమిండియా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. టీమిండియా దుబాయ్ లో ఉన్న త‌రుణంలోనే.. వైస్ కెప్టెన్ గిల్ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. హాంకాంగ్ జ‌ట్టుకు భారీ సాయం చేశాడు టీమిండియా స్టార్ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్. హాంకాంగ్ ప్లేయ‌ర్ల‌కు త‌న బ్యాటింగ్ టెక్నిక్స్ చెబుతూ.... వాళ్ల‌కు ట్రైనింగ్ ఇచ్చాడు గిల్‌.

ఇక దానికి త‌గ్గ‌ట్టుగానే.. హంకాంగ్ ప్లేయ‌ర్లు కూడా... ఒత్తిడిని ఎలా త‌ట్టుకోవాలని గిల్ ను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఇది ఇలా ఉండ‌గా.. ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా ఇప్ప‌టికే ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా.. ఇవాళ పాకిస్థాన్ తో త‌ల‌ప‌డ‌నుంది. అటు హంకాంగ్ మాత్రం రెండు మ్యాచ్ లు ఆడి.. రెండింటిలోనూ ఓడిపోయింది. అంటే దాదాపు హంకాంగ్ జ‌ట్టు ఈ టోర్న‌మెంట్ నుంచి ఎలిమినేట్ అయిన‌ట్లే. క్లిక్

Next Story