గిల్ ను డకౌట్ చేసేందుకు ఇంగ్లాండ్ స్కెచ్..రంగంలోకి ఆ కొత్త బౌలర్!

by velandi.Saikiran |   (  Updated:2025-07-10 02:41:18  IST  )

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి మూడవ టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ వేదికగ

గిల్ ను డకౌట్ చేసేందుకు ఇంగ్లాండ్ స్కెచ్..రంగంలోకి ఆ కొత్త బౌలర్!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి మూడవ టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ వేదికగా (Lord's, London ) ఈ మ్యాచ్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో మూడవ టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు.. సంసిద్ధమయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ దూకుడును ఆపేందుకు ఇంగ్లాండు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఇందు కోసం కొత్త బౌలర్ ను రంగంలోకి దించబోతోంది ఇంగ్లాండు టీం. మూడవ టెస్ట్ కోసం రంగంలోకి... జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఆర్చర్ బౌలింగ్ లో గిల్ కు (Shubman Gill) మంచి రికార్డు లేదు. అతని బౌలింగ్ లో రెండుసార్లు గిల్ అవుట్ అయ్యాడు. టెస్టుల్లో గిల్ వర్సెస్ ఆర్చర్ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే... ఆర్చర్ వేసిన 28 బంతులను గిల్ ఫేస్ చేశాడు. ఈ నేపథ్యంలోనే 18 పరుగులు మాత్రమే చేశాడు.

రెండుసార్లు ఆర్చర్ బౌలింగ్ లో గిల్ అవుట్ అయ్యాడు. యావరేజ్ 9 మాత్రమే ఉంది. అంటే ఇవాళ జరిగే మ్యాచ్ లో... గిల్ బ్యాటింగ్ కు రాగానే ఆర్చర్ ను బౌలింగ్ చేయించే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆర్చర్ ను గిల్... ఈ మూడో టెస్ట్ మ్యాచ్ లో ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా... చెరో మ్యాచ్ గెలిచాయి.

Next Story