- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంభీర్‌తో 5 గంటలు చర్చ.. ఫ్యూచర్ గురించి మాట్లాడిన గిల్?
గంభీర్‌తో 5 గంటలు ఫోన్‌లో మాట్లాడిన గిల్. కెప్టెన్సీ, ఫ్యూచర్ గురించే చర్చించారంటున్న బీసీసీఐ వర్గాలు.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ టెస్టు సిరీసులో టీమిండియాకు శుభ్‌మన్ గిల్ సారధ్యం వహిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి వారిని కాదని గిల్‌ను కెప్టెన్ చేసేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో గిల్ 4-5 గంటలు ఫోన్‌లో మాట్లాడాడట. ఇంగ్లండ్ సిరీస్, తన భవిష్యత్తు, కొత్త బాధ్యతలు ఈ విషయాలన్నింటి గురించి వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అలాగే ఈ నెల 6వ తేదీన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా గిల్‌ను కలిసి తన ఫ్యూచర్ గురించి చర్చించినట్లు సమాచారం.
ఆ మరుసటి రోజే రోహిత్ తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడే గిల్‌ను కెప్టెన్ చెయ్యాలని డిసైడ్ అయినట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. దానికితోడు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో పెట్టడం కూడా గిల్‌కు కలిసొచ్చింది. అతని కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలకు నమ్మకం పెంచింది. దీంతో ఇంగ్లండ్‌లో జట్టును నడిపించే బాధ్యత గిల్‌కే ఇవ్వాలని వాళ్లు డిసైడ్ అయ్యారట.






