గంభీర్ కు న‌చ్చని, ఆ ప్లేయ‌ర్ కు గిల్ స్పెష‌ల్ గిఫ్ట్

by velandi.Saikiran |

సర్ఫరాజ్ ఖాన్ కు అదిరిపోయే గిఫ్ట్ అందించాడు భారత జట్టు వన్డే కెప్టెన్ గిల్.

గంభీర్ కు న‌చ్చని, ఆ ప్లేయ‌ర్ కు గిల్ స్పెష‌ల్ గిఫ్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సర్ఫరాజ్ ఖాన్ కు ( Sarfaraz Khan ) అదిరిపోయే గిఫ్ట్ అందించాడు భారత జట్టు వన్డే కెప్టెన్ గిల్ ( Shubman Gill ). గోల్డ్ కలర్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. క్యాషియో జీ shock GMW అనే బ్రాండ్ వాచ్ ను ఇచ్చాడు గిల్. దీని ధర 50 వేల రూపాయల వరకు ఉంటుందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే ఈ విషయాన్ని స్వయంగా కుర్ర క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు గిఫ్ట్ ఇచ్చినందుకు స్పెషల్ థాంక్స్ అంటూ గిల్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడబోతున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ బంపర్ ఆఫర్ తగిలినందుకుగాను గిల్ గిఫ్ట్ ఇచ్చాడట.

సర్ఫరాజ్ ఖాన్ అంటే గౌతమ్ గంభీర్ కు అస్సలు పడదన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ ఆడిన సమయంలో భారత డ్రెస్సింగ్ రూం విషయాలను సర్ఫరాజ్ ఖాన్ బహిర్గతం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి సర్పరాజ్ ను గౌతమ్ గంభీర్ దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి సర్ఫరాజ్ ఖాన్ కు గిల్ బహుమానం ఇవ్వడంపై గంభీర్ సీరియస్ గా ఉన్నాడట.

Next Story