ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు గిల్‌కు రవిశాస్త్రి కీలక సూచన

by Harish |

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు.

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు గిల్‌కు రవిశాస్త్రి కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. సహనంగా, ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. తాజాగా ఐసీసీ రివ్యూలో శాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ పర్యటన గిల్‌కు అంత సులభంగా ఉండదని, సవాల్ తప్పదన్నాడు. కానీ, ఈ టూరు నుంచి గిల్ నేర్చుకుంటాడని చెప్పాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ సారథిగా ఆకట్టుకున్నాడని చెప్పాడు. టోర్నీ ఆద్యంతం చాలా ప్రశాంతంగా కనిపించాడని, గిల్ వ్యక్తిగతంగా పరిణితి చెందాడని చెప్పుకొచ్చాడు. ఐదు టెస్టులో సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది.


Next Story