- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీసీ రూల్ బ్రేక్ చేసిన గిల్.. ఏం చేశాడంటే?
ఇంగ్లాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ నిబంధనను అతిక్రమించాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ నిబంధనను అతిక్రమించాడు. డ్రెస్ కోడ్ రూల్స్‌ను ఉల్లంఘించాడు. రాహుల్ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ బ్లాక్స్ సాక్స్ ధరించాడు. టెస్టుల్లో వైట్ సాక్స్ ధరించడం సంప్రదాయం. ఐసీసీ దుస్తులు, సామాత్రి నియమ, నిబంధనలలోని 19.45 నిబంధన ప్రకారం.. టెస్టుల్లో మ్యాచ్‌ల్లో ఆటగాడు వైట్, క్రీమ్ లేదా లైట్ గ్రేట్ కలర్ సాక్స్‌లు మాత్రమే ధరించాలి. కానీ, గిల్ నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్స్ సాక్స్ ఉపయోగించాడు.
ఇది కచ్చితంగా ఐసీసీ నిబంధనను ఉల్లంఘించినట్టే అవుతుంది. దీంతో అతనికి ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, జరిమానా విధించాలా?లేదా? అనేది పూర్తిగా మ్యాచ్ రిఫరీ నిర్ణయమే. లెవల్ 1 నేరంగా పరిగణిస్తే మ్యాచ్ ఫీజులో 10-20 శాతం ఫైన్ పడొచ్చు. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా బ్లాక్ సాక్స్ ధరించలేదని రిఫరీ భావిస్తే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. 2018లో అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఐసీసీ భద్రత, ప్రమాణాలను పాటించని హెల్మెట్ ధరించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా ఎదుర్కొన్నాడు. అలాగే, 2021లో ఇండియాతో మ్యాచ్‌లో రెయిన్ బో కలర్ చిహ్నం ఉన్న జెర్సీని ధరించిన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్‌కు 15 శాతం ఫైన్ పడగా.. 2019 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ అనధికార వాణిజ్య లోగోతో ఉన్న బ్యాటును ఉపయోగించి ఫైన్ కట్టాడు.






