టీమిండియా ప్రిన్స్ గిల్ కు బంపర్ ఆఫర్... టెస్ట్ కెప్టెన్ గా ప్రమోషన్ !

by velandi.Saikiran |

టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్ కు ( Shubman Gill) బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (

టీమిండియా ప్రిన్స్ గిల్ కు బంపర్ ఆఫర్... టెస్ట్ కెప్టెన్ గా ప్రమోషన్ !
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్ కు ( Shubman Gill) బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా నియమించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే పర్మినెంట్ కెప్టెన్ గా కాకుండా... త్వరలోనే జరగబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కెప్టెన్ గా గిల్ ను నియామకం చేసేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

ఈ మేరకు మే రెండవ వారంలో అజిత్ అగర్కర్ ( ajith agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ... ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడబోయే టీమిండియా జట్టును ఫైనల్ చేయనుంది. ఈ సందర్భంగా గిల్ కెప్టెన్సీ పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే బుమ్రా ( Bumrah) ఇద్దరికీ కూడా రెస్ట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. రోహిత్ శర్మ వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న నేపథ్యంలో అతన్ని పక్కకు పెట్టి... బుమ్రాకు అవకాశం ఇవ్వాలని మొదట అనుకున్నారు. కానీ బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ నేపథ్యంలో బుమ్రాకు గాయమైన సంగతి తెలిసిందే.

అయితే ఈ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోల్కొని ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో బుమ్రాపై వేటు వేయకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు అనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఈసారి గిల్ కు కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య... టెస్ట్ సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టెస్టులు రెండు జట్ల మధ్య జరుగుతాయి.

Next Story