- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్ మరో షాక్... శ్రేయాస్ అయ్యర్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ !
భారత జట్టు వన్డే కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : వన్డే వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే భారత జట్టు వన్డే కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా వన్డే కెప్టెన్ గిల్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మెరుగు పడడం లేదు. దానికి తోడు వరుసగా గిల్ గాయాల బారిన పడుతున్నాడు.
ఇప్పటికే టి20 ప్రపంచ కప్ నుంచి తప్పించిన బీసీసీఐ, అటు వన్డే వరల్డ్ కప్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా అతన్ని తొలగించాలని అనుకుంటోందట. కేవలం టెస్టుల్లో అతనికి కెప్టెన్సీ కొనసాగించాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చిందట. గిల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ వన్డే కెప్టెన్ అవుతాడని అంటున్నారు. అతని కెప్టెన్సీ లోని 2027 వన్డే వరల్డ్ కప్ ఆడనుందట భారత జట్టు. అంతేకాదు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. ఎవరు అవునన్నా? కాదన్నా? ఆ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు వరల్డ్ కప్ జట్టులో ఉంటారని చెబుతుందట.






