- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కివీస్ వన్డేలకు శ్రేయాస్ అనుమానమే!
కివీస్ వన్డేలకు శ్రేయాస్ అనుమానమే అని బీసీసీఐ వర్గాలంటున్నాయి. అతను బరువు కోల్పోయి వీక్‌గా ఉన్నాడని చెప్తున్నారు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా యంగ్‌స్టర్ శ్రేయాస్ అయ్యర్.. వచ్చే నెల న్యూజిల్యాండ్‌తో జరిగే వన్డే సిరీస్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. గాయం వల్ల కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న అతను.. సుమారు 6 కేజీల బరువు కోల్పోయాడని, ఇంకా పూర్తిగా కోలుకోని అతనితో క్రికెట్ ఆడించడం సబబు కాదని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. బ్యాటింగ్ చేయగలిగినా.. ఫీల్డింగ్ చేసే ఓపిక అతనికి లేదని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగి, శ్రేయాస్ కోలుకుంటే అతను ముందుగా విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచులు ఆడతాడని ప్రచారం జరిగింది. జనవరి 3, 6వ తేదీల్లో ముంబై తరఫున ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకుంటే న్యూజిల్యాండ్ వన్డేలకు అతన్ని ఎంపిక చేస్తారని పలువురు చెప్పారు. అయితే ప్రస్తుతం అయ్యర్ స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించాడని, కోలుకున్నప్పటికీ 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసే ఓపిక ఉందా? అనే అంశం పరిశీలించాలని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. వైద్యుల నిర్ణయం మేరకు అతను విజయ్ హజారే ట్రోఫీ ఆడటం, ఆ తర్వాత కివీస్‌తో వన్డేలకు ఎంపికవడం ఆధారపడి ఉంటుందని వారు వెల్లడించారు.






