ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా.. ఎవరూ సాయం చేయలేదు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు

by Harish |

ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా.. ఎవరూ సాయం చేయలేదు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో 150 రన్స్ చేసి భారత్ తరపున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. చివరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 79 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్ జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను వివరించాడు. ‘కష్ట సమయాల్లో ఎవరూ సహాయం చేయరు. కొంతమంది మంది మాత్రమే మద్దతుగా ఉంటారు. కాబట్టి, నీకు నువ్వే మద్దతుగా ఉండాలి. ఏడాదిన్నరగా నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా. ఈ సమయంలో నేను ఎంతో నేర్చుకున్నా. గతంలో ఏం జరిగిందనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వర్తమానంలోనే ఉంటా. ఏడాదిన్నర సమయాన్ని నా ఆటను, టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగించా. అదే నాకు ఉపయోగపడింది.’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.


Next Story