RCB చేతిలో ఓటమి..వాళ్లకు శ్రేయస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

by velandi.Saikiran |   (  Updated:2025-05-29 22:30:27  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

RCB చేతిలో ఓటమి..వాళ్లకు శ్రేయస్ స్ట్రాంగ్ వార్నింగ్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏకంగా 8 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో దారుణంగా పంజాబ్ కింగ్స్. అయితే ఈ ఓటమిపై... పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ వ్యాఖ్యానించాడు.

బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో.. వ్యూహాలు ఏమాత్రం పని చేయలేదని స్పష్టం చేశాడు. ఎక్కువ స్కోర్ చేసి ఉంటే కచ్చితంగా మ్యాచ్ గెలిచే వాళ్ళమని తెలిపాడు. తక్కువ స్కోరు ఉండడంతో... బౌలర్లు కూడా ఏమీ చేయలేకపోయారన్నారు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.

బ్యాటింగ్ పైన ఫోకస్ చేస్తాం.. ముఖ్యంగా పిచ్ పైన వర్క్ చేయాల్సి ఉంది అని స్పష్టం చేశాడు. ఒక్క మ్యాచ్ లో ఓడిపోయాం... కానీ యుద్ధం మాత్రం ఓడిపోలేదు అంటూ మిగతా జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 2 ఆడనుంది.

Next Story