- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీ-ఎంట్రీలో శ్రేయాస్ అదుర్స్..82 పరుగులు చేసి మరీ
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వర్సెస్ ముంబై మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ గా బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్, 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన శ్రేయాస్ అయ్యర్, దాదాపు రెండు నెలల పాటు భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే ఈ రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్న శ్రేయాస్ అయ్యర్, విజయ్ హజారే టోర్నమెంటులో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్ లోనే 82 పరుగులతో అదరగొట్టాడు.
ఇవాళ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వర్సెస్ ముంబై మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ గా బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్, 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 38 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన శ్రేయాస్ అయ్యర్, 154 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. దీంతో భారత ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా కనిపిస్తున్నారు. వచ్చే న్యూజిలాండ్ సిరీస్ లో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కాగా జనవరి 11వ తేదీ నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ కూడా ఆడనున్నాడు.






