భారత జట్టులోకి శ్రేయస్ అయ్యర్.. గ్రూప్- ఏ జట్టు కెప్టెన్‌గా భాద్యతలు

by Malleboina Mahesh |

భారత యువ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత సెలక్షన్ కమిటీ తాజాగా ఇండియా A జట్టును ప్రకటించింది.

భారత జట్టులోకి శ్రేయస్ అయ్యర్.. గ్రూప్- ఏ జట్టు కెప్టెన్‌గా భాద్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత యువ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తిరిగి భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత సెలక్షన్ కమిటీ (Selection Committee) తాజాగా ఇండియా A జట్టును ప్రకటించింది. ఈ జట్టు ఆస్ట్రేలియా Aతో మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియా A జట్టు సెప్టెంబర్ 30న కాన్పూర్‌లో ఆడనుంది. ఈ మూడు వన్డేల కోసం జట్టును ప్రకటించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు అవకాశం కల్పించారు. అయితే మొదటి వన్డేకు ఒక జట్టును, రెండు, మూడు వన్డేలకు మరో జట్టును సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును కూడా ప్రకటించారు.

ఇండియా A జట్టు (1వ వన్డే): కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రబ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్జ్, విప్రాజ్ నిజామ్, నిశాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుద్ధవీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్యా, సిమర్జీత్ సింగ్.

ఇండియా A జట్టు (2వ & 3వ వన్డేలు): కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ప్రబ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్జ్, విప్రాజ్ నిజామ్, నిశాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుద్ధవీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.

రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు (ఇరానీ కప్): కెప్టెన్ రాజత్ పటీదార్, అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యశ్ ధూల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, మనవ్ సుతర్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, అంషుల్ కాంబోజ్, సారాంశ్ జైన్.

ఆరు నెలల విరామం కావాలని శ్రేయస్ అయ్యర్ రిక్వేస్ట్

శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి సమాచారం అందిస్తూ రెడ్ బాల్ క్రికెట్‌ నుంచి ఆరు నెలల విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. యూకేలో వెన్ను శస్త్రచికిత్స తర్వాత బాగా కోలుకున్నప్పటికీ, సూదీర్ఘ ఫార్మాట్ ఆడుతున్న సమయంలో మళ్లీ వెన్ను నొప్పి, గట్టిపడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపాడు. ఈ సమయంలో తాను ఎండ్యూరెన్స్, ఫిట్‌నెస్, బాడీ రిజిలియెన్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐకి రిక్వెస్ట్ చేశాడు. దీంతో శ్రేయస్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ఇరానీ కప్ జట్టుకు ఎంపిక చేయలేదు.

Next Story