కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ మధ్య గొడవలు... ఇదిగో వీడియో ?

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా.. శనివారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య

కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ మధ్య గొడవలు... ఇదిగో వీడియో ?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా.. శనివారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో.. పంజాబ్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే.. ఈ మ్యాచ్ లో ఓ వివాదాస్పద సంఘటన జరిగింది. విరాట్ కోహ్లీ , పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య చిన్నపాటి గొడవ గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. మ్యాచ్ విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు.. మాట మాట మాట్లాడుకొని... ఒకరినొకరు తోసేసుకున్నారు.

అంతకు ముందు శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయిన తర్వాత... అతన్ని విరాట్ కోహ్లీ ర్యాగింగ్ చేయడం కనిపించింది. ఇక మ్యాచ్ విజయం సాధించిన తర్వాత అదే విషయాన్ని గుర్తు చేస్తూ విరాట్ కోహ్లీ, శ్రేయ సయ్యద్ గొడవ పడినట్లు తెలుస్తోంది. అది గొడవనా? లేక సరదాగా మాట్లాడుతున్నారా ? అనేది తేలాల్సి ఉంది. కానీ ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాస్త ఓవరాక్షన్ చేశాడని అంటున్నారు. వాదేరా విషయంలో కూడా విరాట్ కోహ్లీ రెచ్చిపోయి వ్యవహరించడానికి కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు పైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Next Story