కేకేఆర్‌తో అందుకే విడిపోవాల్సి వచ్చింది : శ్రేయస్ అయ్యర్

by Harish |   (  Updated:2025-01-20 17:58:33  IST  )

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో విడిపోవడంపై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

కేకేఆర్‌తో అందుకే విడిపోవాల్సి వచ్చింది : శ్రేయస్ అయ్యర్
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో విడిపోవడంపై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే విడిపోవాల్సి వచ్చిందని తెలిపాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. ‘కోల్‌కతా చాంపియన్‌గా నిలవడం అద్భుతంగా అనిపించింది. ఆ జట్టుతో ప్రతి క్షణం ఆస్వాదించా. ఐపీఎల్ తర్వాత చాలా సార్లు మాట్లాడుకున్నాం. కానీ, రిటెన్షన్ అంశం చర్చకు రాలేదు. ఏం జరుగుతుందని కంగారుపడ్డాను. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల చివరికి విడిపోవాల్సి వచ్చింది. అయితే, అది పరస్పర అంగీకారంతోనే జరిగింది. రిటెన్షన్ వారం రోజుల ముందే నాకు తెలిసింది. నిర్దిష్టమైన సమాచారం లేనప్పుడు కచ్చితంగా బాధపడతాం. దీంతో ఏం జరిగినా పర్వాలేదని నా నిర్ణయం తీసుకున్నా.’ అని అయ్యర్ తెలిపాడు. గతేడాది అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా చాంపియన్‌గా నిలిచింది. అయితే, అనూహ్యంగా ఫ్రాంచైజీ అతన్ని వేలంలోకి వదిలివేసింది.ఐపీఎల్-2025 వేలంలో అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ భార ధర రూ.26.75 కోట్లు వెచ్చించింది. వచ్చే సీజన్‌లో పంజాబ్‌ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.

Next Story