- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజతంతో మెరిసిన షూటర్ తోమర్
by Phanindra |
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో షూటర్ తోమర్ రజతంతో మెరిశాడు. అద్భుతమైన ప్రదర్శన చేసిన అతను త్రుటిలో స్వర్ణం కోల్పోయాడు.

X
దిశ, స్పోర్ట్స్: ఒలింపియన్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ తన ఫామ్ కొనసాగించాడు. కైరో వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో 466.9 పాయింట్లు సాధించిన ఈ 24 ఏళ్ల తోమర్.. చైనాకు చెందిన యుకున్ లియూ (467.1 పాయింట్లు) చేతిలో త్రుటిలో స్వర్ణం కోల్పోయాడు. ఫ్రాన్స్‌కు చెందిన రొమేన్ ఆఫ్రిరీ 454.8 పాయింట్లతో కాంస్యం సాధించాడు. మరో భారతీయుడు నీరజ్ కుమార్ 432.6 పాయింట్లతో ఐదో స్థానంలో టోర్నీ ముగించాడు. అంతకుముందు క్వాలిఫైయర్స్‌లో 597-40ఎక్స్ పాయింట్లతో ప్రపంచ రికార్డును సమం చేసి వార్తల్లో నిలిచిన తోమర్.. త్రుటిలో స్వర్ణం చేజార్చుకొని రజతంతో సరిపెట్టుకున్నాడు.
Next Story






