షాకింగ్ న్యూస్.. IPLకు విధ్వంసకర బ్యాటర్ రస్సెల్ రిటైర్మెంట్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-30 07:39:51  IST  )

ఐపీఎల్ 2026 ను దృష్టిలో పెట్టుకొని అన్ని జట్లు తమకు అవసరం లేని ప్లేయర్లను జట్ల నుంచి విడుదల చేసింది. దీంతో స్టార్ ప్లేయర్లు త్వరలో జరగబోయే మినీ వేలంలో పాల్గొననున్నారు.

షాకింగ్ న్యూస్.. IPLకు విధ్వంసకర బ్యాటర్ రస్సెల్ రిటైర్మెంట్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ను దృష్టిలో పెట్టుకొని అన్ని జట్లు తమకు అవసరం లేని ప్లేయర్లను జట్ల నుంచి విడుదల చేసింది. దీంతో స్టార్ ప్లేయర్లు త్వరలో జరగబోయే మినీ వేలంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు స్టార్ క్రికెట్లర్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. శనివారం డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ వేలం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. ఈ రోజు మరో విధ్వంసకరమైన బ్యాటర్, ఆల్ రౌండర్ రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున భారీ ఆల్‌రౌండర్‌గా రాణించిన ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు (రిటైర్మెంట్) ప్రకటించారు. అలాగే వచ్చే సీజన్‌లో తాను KKR సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరనున్నట్లు రస్సెల్ తెలిపారు.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, తనకు అండగా నిలిచిన యాజమాన్యం, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉద్వేగభరితమైన వీడియోను రస్సెల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్ తన కెరీర్‌లో 2,651 పరుగులు సాధించడంతో పాటు, 123 వికెట్లు తీశారు. తన పవర్ హిట్టింగ్‌తో అనేక మ్యాచ్‌లలో KKRకు ఒంటిచేత్తో విజయాలు అందించిన రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఈ రిటైర్మెంట్ ప్రకటన సరిగ్గా ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన మరుసటి రోజునే రావడం గమనార్హం. కేవలం 24 గంటల్లోనే ఇద్దరు కీలక అంతర్జాతీయ ఆటగాళ్లు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పడంతో.. IPL 2026 మినీ వేలం ముందు ఫ్రాంఛైజీల వ్యూహాలలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. రస్సెల్ KKR యొక్క సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరడం వల్ల, రాబోయే యువ ఆటగాళ్లకు అతని అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Next Story