నెం.1 సీడ్ సబలెంకకు షాక్.. వింబుల్డన్ ఫైనల్లోకి అమండా అనిసిమోవా

by Kema Shiva Kumar |

అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా (Amanda Anisimova) వింబుల్డన్-2025 సెమీ ఫైనల్‌లో ఘన విజయం సాధించింది.

నెం.1 సీడ్ సబలెంకకు షాక్.. వింబుల్డన్ ఫైనల్లోకి అమండా అనిసిమోవా
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా (Amanda Anisimova) వింబుల్డన్-2025 సెమీ ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. నెంబర్‌వన్ సీడ్ బెలారసియన్ క్రీడాకారిణి అర్యాన సంబలెంక (Aryna Sabalenka)ను 6-4, 4-6, 6-4‌ తేడాతో మట్టికరిపించి ఏకంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో అమాండా అనిసిమోవా తుదిపోరులో పొలాండ్ క్రీడాకారిణి ఇగా స్వయాటెక్‌ (Iga Swayatech)తో తలపడనుంది. ఈ విజయం అమాండా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన ఆమె, ఇప్పుడు వింబుల్డన్‌లో కూడా అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే అవకాశానికి అమాండా అనిసిమోవా ఒక్క అడుగు దూరంలో ఉంది.

Next Story