- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhandoraa Trailer: కల్లు మత్తు కాదు సార్.. ఇది కులం మత్తు, టైం పట్టింది
శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ దండోరా. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నటుడు శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ దండోరా. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎమోషన్స్, ప్రేమ, కాస్త డ్రామా, కామెడీ అన్ని మిక్స్ చేసి ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీశారు దర్శకుడు మురళీ కాంత్. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ లో నటుడు శివాజీ అదరగొట్టేసాడు. వన్ మ్యాన్ షో అన్నట్లుగా ఆయనే దూసుకు వెళ్ళాడు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా కోర్టు సీన్ లో శివాజీ డైలాగ్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. కల్లు మత్తు కాదు కదా సార్...రాత్రి తాగింది.. పొద్దుగాల దిగడానికి..కులం మత్తు సార్ టైం పట్టింది అంటూ శివాజీ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలేట్ గా నిలిచింది. మరి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.






