ఆ లేడీ బెడ్ రూంలోకి వెళ్లిన టీమిండియా స్టార్ ప్లేయర్?

by velandi.Saikiran |   (  Updated:2025-08-24 10:47:51  IST  )

తన ప్రియురాలు సోఫీ షైన్.. బెడ్ రూమ్ లోకి శిఖర్ ధావన్ వెళ్ళాడు. ఈ సందర్భంగా ఆమెకు టైట్ హగ్గు కూడా ఇచ్చాడు.

ఆ లేడీ బెడ్ రూంలోకి వెళ్లిన టీమిండియా స్టార్ ప్లేయర్?
X

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా మాజీ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్ బ్యాట్స్మెన్ గా... టీమిండియాలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన శిఖర్ ధావన్... ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కట్టుకున్న భార్య విడాకులు ఇవ్వడంతో... తనకు నచ్చిన అమ్మాయిలతో తెగ తిరిగేస్తున్నాడు. విదేశాలకు ట్రిప్పులు కూడా వేస్తున్నాడు.

ఇందులో భాగంగానే... అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోఫీ షైన్ ( Sophie Shine) అనే విదేశీ అమ్మాయితో శిఖర్ ధావన్ జాలిగా తిరుగుతున్న వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెట్ స్టేడియాలకు కూడా... జంటగా వెళ్లి మెరుస్తున్నారు ఈ ఇద్దరు. దీంతో వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా తన ప్రియురాలు సోఫీ షైన్.. బెడ్ రూమ్ లోకి శిఖర్ ధావన్ వెళ్ళాడు. ఈ సందర్భంగా ఆమెకు టైట్ హగ్గు కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీళ్ళిద్దరూ లవర్స్ అని... ఆమె బెడ్ రూమ్ లోకి ధావన్ వెళ్తే తప్పేమీ లేదని ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story