మొద‌టి భార్య శాపనార్థాలు..రెండో పెళ్లిపై శిఖ‌ర్ ధావ‌న్ సంచ‌ల‌న పోస్ట్‌

by velandi.Saikiran |

తన రెండో పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ ఈ పోస్ట్ పెట్టారు శిఖ‌ర్‌ ధావన్.

మొద‌టి భార్య శాపనార్థాలు..రెండో పెళ్లిపై శిఖ‌ర్ ధావ‌న్ సంచ‌ల‌న పోస్ట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు భారత జట్టులో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతూ, ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఒంటి చేత్తో భారత జట్టును కూడా గెలిపించాడు శిఖర్ ధావన్. అలాంటి శిఖర్ ధావన్ లేటెస్ట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది కాలంగా ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు శిఖ‌ర్‌ ధావన్. ఢిల్లీలో శిఖర్ ధావన్, సోఫీ షైన్ వివాహం జరిగింది. ఈ పెళ్లికి రోహిత్ శర్మ, చాహల్ లాంటి భారత క్రికెటర్లు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన శిఖర్ ధావన్

రెండో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన రెండో పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ ఈ పోస్ట్ పెట్టారు శిఖ‌ర్‌ ధావన్. నిన్ను ఎవరు కూడా పెళ్లి చేసుకోబోరని.. శిఖర్ ధావన్ కు ఆయన మొదటి భార్య శాప‌నార్ధాలు పెట్టిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందుకే రెండో పెళ్లి చేసుకొని శిఖర్ ధావన్ చూపించాడని పోస్టులు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా ప్రచారంపై శిఖర్ ధావన్ క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టారు. తన మొదటి భార్య గురించి జరుగుతున్న ప్రచారం ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారాలు చేయకండి ప్లీజ్ అంటూ వెల్లడించారు. తాను ఎప్పుడు పాజిటివిటీని మాత్రమే కోరుకుంటానని తెలిపారు. సోఫీ షైన్ తో తన కొత్త లైఫ్ సంతోషంగా మొదలుపెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. క్లిక్

Next Story