ప్రేయసితో పెళ్లికి రెడీ.. భారత క్రికెటర్ ఫోటోలు వైరల్

by velandi.Saikiran |

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ప్రేయసి సోఫీ షైన్ తో పెళ్లికి సిద్ధమైనట్లు ఫోటోలు బయటకు వచ్చాయి.

ప్రేయసితో పెళ్లికి రెడీ.. భారత క్రికెటర్ ఫోటోలు వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు శిఖర్ ధావన్. ఓపెనర్ గా బరిలోకి దిగి.. ఇరగదీసే వాడు. రోహిత్ శర్మ ఒకవైపు ఆడుతుంటే మరో ఎండ్ నుంచి శిఖర్ ధావన్ తన పనిచేసుకుంటూ ముందుకు సాగేవాడు. అయితే ఎప్పుడైతే భార‌త జ‌ట్టులోకి శుభ్ మాన్ గిల్ వచ్చాడో? అప్పుడే శిఖర్ ధావన్ కెరీర్ క్లోజ్ అయిపోయింది. వచ్చిన అవకాశాన్ని గిల్ సద్వినియోగం చేసుకొని జట్టులో సెటిలైపోయాడు. ఈ దెబ్బకు శిఖర్ ధావన్ కెరీర్ ముగిసింది. ఆ తర్వాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్.. సోఫీ షైన్ ( Sophie Shine) అనే అమ్మాయిని ప్రేమించాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న శిఖర్ ధావన్ కు, కిందటి సంవత్సరమే సోఫీ షైన్ పరిచయమైంది. వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది.

ప్రియురాలితో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ప్రేయసి సోఫీ షైన్ తో పెళ్లికి సిద్ధమైనట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. లేటెస్ట్ గా సంగీత్ వేడుకల ఫోటోలు కూడా నేషనల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఢిల్లీలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లోనే సోఫి షైన్, శిఖర్ ధావన్ పెళ్లి జరగనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో పెళ్లి చేసుకున్నాడు శిఖర్ ధావన్. కొన్ని అనివార్య కారణాలవల్ల 2023లో విడాకులు కూడా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఐర్లాండ్ కు చెందిన సోఫి షైన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడట.

Next Story