Shikhar Dhawan: జాక్వెలిన్‌‌తో కలిసి చిందులేసిన ధవన్.. పోస్టర్ అదిరిందిగా..!

by Phanindra |

టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధవన్ కొత్త అవతారం ఎత్తాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి చేసిన సాంగ్ పోస్టర్ షేర్ చేశాడు.

Shikhar Dhawan: జాక్వెలిన్‌‌తో కలిసి చిందులేసిన ధవన్.. పోస్టర్ అదిరిందిగా..!
X

దిశ, స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan).. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత యాక్టింగ్‌లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అప్పుడోసారి ఒక సినిమాలో తళుక్కున మెరిసిన ధవన్.. ఈసారి బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో (Jacqueline Fernandez) కలిసి స్టెప్పులేస్తున్నాడు. వీరిద్దరూ నటించిన ప్రైవేట్ సాంగ్ పోస్టర్‌ను ధవన్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు.

ఈ పాట పేరు ‘బెసోస్’ అని పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. శ్రేయా ఘోషల్, కార్ల్ వైన్ పాడిన ఈ సాంగ్‌ను.. ప్లే డీఎంఎఫ్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పాట టీజర్‌ను విడుదల చేస్తున్నామని, పూర్తి పాటను మే 8వ తేదీన రిలీజ్ చేస్తామని ధవన్ తన పోస్టులో వెల్లడించాడు. ఫ్యాన్స్ అంతా ఈ సాంగ్ ఎలా ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా, 2023లో తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకుల తర్వాత ధవన్ (Shikhar Dhawan) చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాడు. కొడుకు జొరావర్ తనకు దూరం అవుతాడని బాధపడ్డాడు. పలుమార్లు సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో సోఫీ షైన్ అనే మరో సుందరితో కనిపించాడు. తాజాగానే ఆమెతో రిలేషన్‌లో ఉన్న విషయాన్ని ధవన్ ధ్రువీకరించాడు.

Next Story