ధావన్‌కు రిలీఫ్‌..5.72 కోట్లు తిరిగి ఇచ్చేయాల‌ని మాజీ భార్యకు ఆదేశాలు

by velandi.Saikiran |

ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఊరట ఇచ్చింది. భరణంగా ధావన్ ఇచ్చిన 5.72 కోట్లు తిరిగి ఇచ్చేయాలని ఆయేషా ముఖర్జీని ఆదేశించింది.

ధావన్‌కు రిలీఫ్‌..5.72 కోట్లు తిరిగి ఇచ్చేయాల‌ని మాజీ భార్యకు ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు భారత జట్టులో స్టార్ ఆటగాడిగా కొనసాగుతూ ఎన్నో విజయాలను అందించాడు. అయితే అలాంటి స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్, ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో పెళ్లి జరిగి రెండు రోజులు కూడా కాలేదు, అంతలోనే శిఖర్ ధావన్ కు భారీ ఊరట లభించింది. పెళ్లయిన వేళా విశేషమో తెలియదు కానీ, కోర్టు నుంచి కీలక తీర్పు వచ్చింది. ఆయేషా ముఖర్జీ కేసులో శిఖ‌ర్ ధావ‌న్ కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది.

శిఖర్ ధావన్ కు భారీ ఊరట.. కోర్టు కీలక తీర్పు

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారీ ఊరట ఇచ్చింది. భరణంగా శిఖర్ ధావన్ ఇచ్చిన దాదాపు 5.72 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీని ఆదేశించింది ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు. ప్రాపర్టీ సెటిల్మెంట్ కింద ఆ మొత్తం చెల్లించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది ఢిల్లీ కోర్టు. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఫైర్ అయింది. వెంటనే 5.72 కోట్లు చెల్లించాలని పేర్కొంది. ఇది ఇలా ఉండగా... ఫిబ్రవరి 21వ తేదీన శిఖర్ ధావన్ రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. దాదాపు ఏడాదికాలంగా ఈ జంట డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.

Next Story