ప్రియురాలితో శిఖర్ ధావన్..రొమాంటిక్ ఫోటోలు వైరల్

by velandi.Saikiran |

టీమిండియా ( Team India) మాజీ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మరోసారి తన కొత్త ప్రియురాలితో

ప్రియురాలితో శిఖర్ ధావన్..రొమాంటిక్ ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ( Team India) మాజీ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మరోసారి తన కొత్త ప్రియురాలితో దర్శనమిచ్చాడు. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న శిఖర్ ధావన్... ఆమెతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన ప్రియురాలితో... శిఖర్ ధావన్ కెనడా దేశానికి వెళ్ళాడు. శిఖర్ ధావన్ కొత్త ప్రియురాలు పేరు సోఫీ షైన్ ( Sophie Shine) అన్న సంగతి తెలిసిందే.

భార్య దూరం కావడంతో... గత కొన్నాళ్ళుగా సింగిల్ గానే జీవితాన్ని... లీడ్ చేస్తున్నాడు ధావన్. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ దుబాయిలో (Dubai) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనే తన ప్రియురాలి సోఫీ షైన్ తో.. మెరిశాడు శిఖర్ ధావన్. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా ఆమెను తీసుకు వెళ్తున్నాడు. దాదాపు వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే తన ప్రియురాలు సోఫీ షైన్ బర్త్ డే సందర్భంగా కెనడాకు వెళ్లారు. అనంతరం అక్కడ రొమాంటిక్ ఫోటోలు దిగి... సోషల్ మీడియాలో షేర్ చేశాడు శిఖర్ ధావన్. తన ప్రియురాలు పుట్టిన రోజు అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు రొమాంటిక్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజెన్స్.. వదినమ్మ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story