ప్రియురాలితో చిల్ అవుతున్న టీమిండియా క్రికెట‌ర్ !

by velandi.Saikiran |

రిటర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శిఖర్ ధావన్, తన ప్రియురాలు సోఫి షైన్ తో గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రియురాలితో చిల్ అవుతున్న టీమిండియా క్రికెట‌ర్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి తెలియని వారు ఉండరు. ధోని కెప్టెన్సీలో ఎన్నో అవకాశాలు దక్కించుకున్న శిఖర్ ధావన్ ( shikhar dhawan ), ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ముఖ్యంగా గిల్ కు బిసిసిఐ ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో శిఖర్ ధావన్ కెరీర్ ముగిసిపోయింది. దీంతో రిటైర్మెంట్ తీసుకున్న శిఖర్ ధావన్, త్వరలోనే సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ప్రముఖ మోడల్ సోఫి షైన్ ( Sophie Shine) అనే విదేశీ మహిళను ప్రేమిస్తున్న శిఖర్ ధావన్, ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.

గోవాలో చిల్ అవుతున్న శిఖర్ ధావన్ ?

రిటర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శిఖర్ ధావన్, తన ప్రియురాలు సోఫి షైన్ తో గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా ధావన్ పంచుకున్నాడు. అయితే అందులో ఉన్న లొకేషన్స్ చూస్తే గోవాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెకేషన్ లో రొమాంటిక్ ఫోజులిస్తూ ఈ ఇద్దరు ఫోటోలు దిగారు. బైక్ పైన, బీచ్ లో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా శిఖర్ ధావన్ రెండో పెళ్లి ఫిబ్రవరి మూడో వారంలో జరగనుంది. ఢిల్లీలో గ్రాండ్ గా ఈ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి భారత క్రికెటర్లు కూడా రాబోతున్నారట.

Next Story