ఇంగ్లాండ్‌కు సాయి సుదర్శన్‌ను తీసుకెళ్లండి : రవిశాస్త్రి

by Harish |

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో సత్తాచాటుతున్నాడు.

ఇంగ్లాండ్‌కు సాయి సుదర్శన్‌ను తీసుకెళ్లండి : రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్ : గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో సత్తాచాటుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 456 రన్స్ చేశాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ టూరుకు సాయి సుదర్శన్‌ను ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా సాయి సుదర్శన్‌కు మద్దతుగా నిలిచాడు.

తాజాగా ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ..ఇంగ్లాండ్ పరిస్థితులకు అతను సరిగ్గా సరిపోతాడన్నాడు. సాయి ఆల్‌ ఫార్మాట్ ప్లేయర్ అని చెప్పాడు. ‘లెఫ్ట్ హ్యాండర్ కావడం, ఇంగ్లాండ్ పరిస్థితులు తెలిసి ఉండటం, అతని టెక్నిక్, ఆడే విధానం వంటి కారణాలతో అతను జట్టులో కచ్చితంగా ఉంటాడని నమ్ముతున్నా.’అని శాస్త్రి తెలిపాడు. సాయికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది. కౌంట్ చాంపియన్‌షిప్ ఆడిన నేపథ్యంలో అతను భారత్ తరపున ఎక్స్ ఫ్యాక్టర్ కానున్నాడు. అయితే, సాయి ఇంకా టెస్టు అరంగేట్రం చేయలేదు. ఇప్పటివరకు భారత్ తరపున మూడు వన్డేలు ఆడిన అతను రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఓపెనర్ స్థానం కోసం తీవ్ర పోటీ నేపథ్యంలో అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు.


Next Story