- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్నో నుంచి శార్దూల్‌ను కొనుగోలు చేసిన ముంబై.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా?
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్‌లో సొంత గూటికి చేరాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్‌లో సొంత గూటికి చేరాడు. ముంబైకి చెందిన శార్దూల్ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్నాడు. ఈ ఏడాది అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ వేలానికి ముందు లక్నో నుంచి అతన్ని ముంబై కొనుగోలు చేసింది. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీల మధ్య ట్రేడ్ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఐపీఎల్ గురువారం వెల్లడించింది.
లక్నో నుంచి శార్దూల్‌ను ముంబై ట్రేడ్ చేసుకోనున్నట్టు బుధవారం వార్తలు వచ్చాయి. అర్జున్ టెండూల్కర్‌ను లక్నోకు ఇచ్చి శార్దూల్‌ను తీసుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ, ముంబై ప్లేయర్ టూ ప్లేయర్ ట్రేడ్ కాకుండా క్యాష్ ట్రేడ్‌కు మొగ్గు చూపింది. శార్దూల్ కోసం లక్నోకు రూ.2 కోట్లు ఇచ్చింది. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో శార్దూల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే, లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో శార్దూల్‌ను జట్టులోకి తీసుకున్నారు. గత సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 13 వికెట్లు తీశాడు. అతన్ని లక్నో రూ.2 కోట్లకు తీసుకోగా అంతే ధరకు ముంబైకి అమ్మింది. శార్దూల్‌ను తీసుకుని ముంబై జట్టు తమ ఫాస్ట్ బౌలింగ్,లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంది.






