ఆడలేమనుకుంటే రిటైర్ అవుతారు.. కోహ్లీ, రోహిత్‌పై శార్దూల్ కామెంట్

by Phanindra |

కోహ్లీ, రోహిత్‌ల టెస్టు రిటైర్‌మెంట్‌పై శార్దూల్ ఠాకూర్ స్పందించాడు. అనుకున్నట్లు ఆడలేమనుకుంటే ప్లేయర్లు రిటైర్ అవుతారని చెప్పాడు.

ఆడలేమనుకుంటే రిటైర్ అవుతారు.. కోహ్లీ, రోహిత్‌పై శార్దూల్ కామెంట్
X

దిశ, స్పోర్ట్స్: టెస్టుల్లో జట్టును ముందుండి నడిపించలేమనే భావన వల్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి ఉంటారని స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అభిప్రాయపడ్డాడు. చాలా గ్యాప్ తర్వాత ఇంగ్లండ్ టెస్టులకు శార్దూల్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ గురించి తన అభిప్రాయాన్ని శార్దూల్ వెల్లడించాడు. ‘వాళ్లు జట్టులో అందరికన్నా సీనియర్లు. అయితే ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఉంటాయి. జట్టు విజయాల్లో భాగం కాలేమని, లేదంటే ఈ ఫార్మాట్లో రాణించలేమని అనిపించినప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు’ అని శార్దూల్ చెప్పాడు.

ఇంగ్లండ్‌లో భారత జట్టు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుందని, ప్రస్తుతం జట్టులో అందరి కన్నా సీనియర్ అయిన జడేజాతోపాటు అందరూ పరీక్షలు ఎదుర్కొంటారని చెప్పాడీ ఆల్‌రౌండర్. అయితే టీం ఎదుర్కొనే ప్రధాన సమస్య మాత్రం వాతావరణం అన్నాడు. ‘ఇంగ్లండ్‌లో మాకు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ వాతావరణం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంగ్లండ్‌లో ఒక్కరోజు ఆటలో అన్నిరకాల వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయి. సూర్యుడు కనిపిస్తున్నంతసేపూ ఆడటానికి బాగుంటుంది. సడెన్‌గా చలి పెరిగిపోతుంది. లేదా చూస్తుండగానే మబ్బులు కమ్మేసి వర్షం మొదలవుతుంది’ అని శార్దూల్ చెప్పుకొచ్చాడు.

Next Story