వెస్ట్ జోన్ కెప్టెన్‌గా శార్దూల్.. రహానే, పుజారాలను పక్కనపెట్టిన సెలెక్టర్లు

by Harish |

దులీప్ ట్రోఫీలో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వెస్ట్ జోన్‌ జట్టుకు కెప్టెన్‌గా నియామకమయ్యాడు.

వెస్ట్ జోన్ కెప్టెన్‌గా శార్దూల్.. రహానే, పుజారాలను పక్కనపెట్టిన సెలెక్టర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వెస్ట్ జోన్‌ జట్టుకు కెప్టెన్‌గా నియామకమయ్యాడు. శుక్రవారం వెస్ట్ జోన్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ముంబై నుంచి ఏడుగురు ప్లేయర్లు, గుజరాత్ నుంచి నలుగురు, మహారాష్ట్ర, సౌరాష్ట్ర నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఎంపిక చేశారు. జైశ్వాల్ జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నారు. అయితే, సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా‌లకు స్థానం దక్కలేదు. ఈ నెల 28 నుంచి క్వార్టర్ ఫైనల్స్‌తో దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. వెస్ట్ జోన్ నేరుగా సెమీస్‌లోనే ఆడనుంది. ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.


Next Story