- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
షేన్ వార్న్ గదిలో సెక్స్ డ్రగ్?

- దర్యాప్తుకు ముందే తొలగించారని కథనం
- వెల్లడించిన థాయిలాండ్ పోలీస్
- 2022 మార్చిలో మరణించిన వార్న్
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియన్ లెజండరీ క్రికెటర్ షేన్ వార్న్ అనుమానాస్పద మృతిపై జరుగుతున్న దర్యాప్తు ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. థాయిలాండ్‌లోని వార్న్ గది నుంచి ఒక వస్తువును తొలగించారంటూ డైలీ మెయిల్ ఒక కథనంలో పేర్కొంది. వార్న్ చనిపోయిన తర్వాత దర్యాప్తు చేస్తున్న ఒక సీనియర్ అధికారిని 'కామాగ్రా' పేరుతో ఉన్న మాత్రల బాటిల్‌ను తొలగించాలని ఆదేశాలు అందినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ మందును అంగస్తభన చికిత్సలో ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఈ ఔషధంలో సిల్డెనాఫిల్ సిట్రేట్ ఉంటుందని.. ఇది వయాగ్రాలో కనిపించే పదార్థమని పేర్కొన్నారు. డైలీ మెయిల్‌తో మాట్లాడిన పోలీసు అధికారి.. తనను ఆ మాత్రల బాటిల్‌ను అక్కడి నుంచి తొలగించాలని సీనియర్ అధికారులు ఆదేశించినట్లు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ పోలీసు అధికారుల ఒత్తిడి మేరకు ఈ బాటిల్ విషయాన్ని కప్పిపెట్టి ఉండొచ్చని ఆయన చెప్పారు.
అధికారిక నివేదిక ప్రకారం గుండెపోటు వచ్చిందని పేర్కొన్నారు. అయితే దానికి కారణం ఏంటనే విషయాలు మాత్రం నివేదికలో రాయలేదు. కామాగ్రా సున్నితమైన అంశం కాబట్టి రాకుండా వదిలేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా శక్తివంతమైన వ్యక్తుల హస్తం ఉందని సదరు పోలీసు అధికారి చెప్పారు. ఒక సీసా మొత్తం అక్కడ ఉంది. అయితే ఎంత మోతాదులో అతను ఔషధం తీసుకున్నాడో తెలియదని చెప్పాడు. 52 ఏళ్ల షేన్ వార్న్ తన స్నేహితులతో కలిసి థాయిలాండ్‌లో సెలవులను గడుపుతున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో సూరత్ థాని ఆసుపత్రి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో.. వార్న్‌ది సహజ మరణంగా పేర్కొన్నారు.