- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mohammed Shami : షమీకి మళ్లీ గాయం.. ఆస్ట్రేలియా పర్యటనకు దూరం
భారత ఫాస్ట్ బౌలర్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు దాదాపు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

దిశ, స్పోర్ట్స్ : భారత ఫాస్ట్ బౌలర్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు దాదాపు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మరోసారి గాయం కారణంగా ఈ పేస్ బౌలర్ హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగే విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం ధ్రువీకరించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ అన్ని మ్యాచ్‌లను ఆడాడు. ఆ సయమంలోనే షమీ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. వరుసగా మోకాలు వాపు పెరుగుతున్నట్లు తెలిసింది. దీంతో షమీ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లన్స్‌లో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ ఏడాది తర్వాత ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యా్చ్‌లో బెంగాల్ గెలుపొందడంలోనూ షమీ కీ రోల్ పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. చండీఘడ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ రాణించి బెంగాల్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
షమీ గైర్హాజరు.. భారత్‌కు బిగ్ షాక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో షమీ ఆడతాడని ముందు నుంచి అంతా భావించారు. అనుభవజ్ఞుడైన షమీ బుమ్రా, సిరాజ్‌లతో కలిస్తే పేస్ దళం మరింత ధృడంగా మారే అవకాశం ఉండేది. ఈ క్రమంలో షమీ తాజా గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఆడే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. బ్రిస్బేన్‌లో మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ షమీ జట్టుతో కలవడం గురించి స్పందించారు. భారత్ పూర్తి ఫిట్‌గా లేని ఫాస్ట్ బౌలర్లను ఆడించి రిస్క్ తీసుకోవాలని భావించడం లేదన్నాడు.






