ఇండియా జెండాపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన షాహిద్ అఫ్రిదీ.. వీడియో వైర‌ల్‌

by Disha Web Desk 13 |
ఇండియా జెండాపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన షాహిద్ అఫ్రిదీ.. వీడియో వైర‌ల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదీ నెటిజ‌న్ల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు. ఇండియా జెండాపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన షాహిద్ అఫ్రిదీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌‌గా మారింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అభిమాని కోరిక‌ను నెర‌వేర్చిన షాహిద్ అఫ్రిదీ నెటిజ‌న్ల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు. ఆ అభిమాని కోరిక‌ను తీర్చిన షాహిద్.. ఇండియా జెండాపై సంత‌కం చేసి అత‌డికి ఇచ్చాడు. ఇండియా జెండాపై షాహిద్ సంత‌కం చేస్తోన్న వీడియో వైర‌ల్‌గా మారింది.

2018లో క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన షాహిద్ అఫ్రిదీ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతోన్నాడు. ఇందులో ఆసియా ల‌య‌న్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవ‌హ‌రిస్తోన్నాడు. శ‌నివారం ఆసియా ల‌య‌న్స్‌, ఇండియా మ‌హ‌రాజాస్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకున్నది. మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఆట‌గాళ్ల కోసం ఏర్పాటు చేసిన బ‌స్‌వైపు షాహిద్ అఫ్రిదీ వెళుతోన్న స‌మ‌యంలో ఓ అభిమాని ఇండియా జెండాపై అత‌డి ఆటోగ్రాఫ్ అడిగాడు. ఇండియా జెండాపై సంత‌కం చేసి అత‌డికి ఇచ్చాడు.


Next Story

Most Viewed