మతం మార్చుకోవాలని అఫ్రిది ఒత్తిడి చేశాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన డానిష్ కనేరియా

by Harish |

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది తనను మతం మార్చుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసేవాడని మరో పాక్ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మతం మార్చుకోవాలని అఫ్రిది ఒత్తిడి చేశాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన డానిష్ కనేరియా
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది తనను మతం మార్చుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసేవాడని మరో పాక్ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కనేరియా 2000 నుంచి 2010 వరకు దాదాపు దశాబ్దంపాటు పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. అనిల్ దల్పత్‌ తర్వాత పాక్‌కు రెండో హిందూ క్రికెటర్ కనేరియా. తాజాగా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కనేరియా పాక్‌లో మైనార్టీలైన హిందువుల దుస్థితిని వివరించాడు.

పాక్‌కు ఆడేటప్పుడు తాను ఎదుర్కొన్న వివక్షను బయటపెట్టాడు. ‘నేను తీవ్ర వివక్ష ఎదుర్కున్నా. దాని వల్లే నా కెరీర్ నాశనమైంది. పాక్‌లో నాకు గౌరవం దక్కలేదు. కారణం వివక్ష. అందుకే, నేను అమెరికాకు వచ్చేశాను. పాక్‌లో మనం ఎదుర్కొన్న దుస్థితిపై ఇప్పుడు గళం విప్పుతున్నాం. పాక్‌లో మనం అనుభవించిన కష్టాలు అమెరికాకు తెలియాలి. అప్పుడే చర్యలు తీసుకోవచ్చు.’అని తెలిపాడు. అలాగే, షాహిది అఫ్రిదిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘అఫ్రిది మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసేవాడు. చాలా సార్లు అతను అలాగే ప్రవర్తించాడు. షోయబ్ అక్తర్, అఫ్రిదితోపాటు చాలా మంది పాక్ ప్లేయర్లు నన్ను ఇబ్బంది పెట్టారు. నాతో భోజనం కూడా చేసేవారు కాదు. కానీ, ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం అలా కాదు. నాకు మద్దతుగా నిలిచాడు.’ అని కనేరియా చెప్పుకొచ్చాడు.


Next Story