- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్‌లో చూసుకుందాం.. సూర్య వ్యాఖ్యలపై షాహీన్ అఫ్రిది రియాక్షన్
by Harish |
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది.

X
దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20ల్లో పాక్‌పై తమ ఆధిపత్యాన్ని 12-3కు పెంచుకుంది. సూపర్-4 మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ హెడ్ టూ హెడ్ రికార్డులను ఉదాహరిస్తూ పాక్ అసలు తమకు పోటీనే కాదన్నాడు. సౌరవ్ గంగూలీ కూడా పాక్‌తో పోరులో భారత్‌ది వన్ వే ట్రాఫిక్ అంటూ వ్యాఖ్యానించాడు. తాజాగా సూర్య వ్యాఖ్యలపై పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది స్పందించాడు. ఫైనల్‌లో చూసుకుందామంటూ కామెంట్స్ చేశాడు. ‘అది అతని సొంత అభిప్రాయం. వారు ఇంకా ఫైనల్‌కు చేరుకోలేదు. చేరుకున్నాక మేము చూస్తాం. మేము ఇక్కడికి ఫైనల్‌కు చేరుకుని ఆసియా కప్ గెలవడానికి వచ్చాం. మా లక్ష్యం అదే. ఫైనల్‌కే ఏ జట్టు వచ్చినా మేము సిద్ధమే.’అని చెప్పుకొచ్చాడు.
Next Story






