- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్ టూరుకు భారత మహిళల క్రికెట్ జట్టు ఖరారు.. ఇద్దరు తెలుగమ్మాయిలకు చోటు
వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే, టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది.

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో భారత పురుషుల క్రికెట్ జట్టు ఐదు టెస్టుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే. మహిళల జట్టు కూడా వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లోనే పర్యటించనుంది. ఇటీవలే హర్మన్‌ప్రీత్ సేన వన్డే ట్రై నేషన్స్ సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ చివర్లో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ టూరులో పాల్గొనే వన్డే, టీ20 జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ తిరిగి టీ20 జట్లులోకి పునరాగమనం చేసింది. దాదాపు ఏడాది కాలంగా ఆమె జాతీయ జట్టుకు దూరంగా ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటడంతో సెలెక్టర్లు ఆమెకు చాన్స్ ఇచ్చారు. హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా, స్నేహ్ రాణా కూడా తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. ఇటీవల ట్రై సిరీస్‌లో స్నేహ్ రాణా 15 వికెట్లతో ప్లేయర ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలకు రెండు జట్లలో స్థానం దక్కింది. ఇటీవల ట్రై సిరీస్‌లో శ్రీ చరిణి భారత్ తరపున అరంగేట్రం చేసింది. ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. వచ్చే నెల 28న ఇరు జట్లు తొలి టీ20లో తలపడతాయి.
వన్డే జట్టు : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన, ప్రాతిక రావల్, హర్లీన్ డియోల్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, తేజాల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే
టీ20 జట్టు : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన,షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.






