- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాప్ టెన్‌లోకి షెఫాలీ, రేణుకా
టీ20 ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లోకి షెఫాలీ, రేణుకా దూసుకొచ్చారు. శ్రీలంకపై మెరుగైన ప్రదర్శనే దీనికి కారణం.

దిశ, స్పోర్ట్స్: శ్రీలంకపై అదరగొడుతున్న భారత అమ్మాయిలు ఐసీసీ ర్యాంకుల్లో కూడా ముందంజ వేశారు. వరుసగా హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయిన టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ తన ర్యాంకును భారీగా మెరుగు పరచుకొని టాప్‌టెన్‌లోకి దూసుకొచ్చింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది. టాప్ ర్యాంకులో ఉన్న ఆసీస్ స్టార్ బెత్ మూనీ కన్నా షెఫాలీ కేవలం 60 పాయింట్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో మరో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన మూడో ర్యాంకులో ఉండగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15వ ర్యాంకులో ఉంది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా తన స్థానం మెరుగు పరచుకొంది. ఏడు స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం 20వ ర్యాంకులో నిలిచింది.
బౌలర్లలో కూడా టీమిండియా ప్లేయర్లు ముందంజ వేశారు. ముఖ్యంగా రేణుకా సింగ్ ఏకంగా 8 స్థానాలు మెరుగు పరచుకొని 7వ స్థానానికి ఎగబాకింది. అంతకుముందు 15 ర్యాంకులో ఉన్న ఆమె.. శ్రీలంకపై మెరుగైన ప్రదర్శనతో టాప్‌టెన్‌లోకి దూసుకొచ్చింది. అలాగే తెలుగు స్పిన్నర్ శ్రీచరణి 17 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకుకు చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టీ20 బౌలర్ల జాబితాలో టాప్‌ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం విండీస్ స్టార్ హేలీ మాథ్యూస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.






