- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేసుకుంటానని యువతిని శారీరకంగా వాడుకున్న RCB స్టార్ ప్లేయర్.. కేసు నమోదు
ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన మహిళ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) క్రికెటర్ యశ్ దయాల్‌పై కేసు పెట్టింది. పెళ్లి ఆశ చూపి మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది.

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన మహిళ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) క్రికెటర్ యశ్ దయాల్‌పై కేసు పెట్టింది. పెళ్లి ఆశ చూపి మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. చీఫ్ మినిస్టర్ ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ (IGRS)లో ఫిర్యాదు చేసిన ఆమె.. ఐదేళ్ల రిలేషన్‌షిప్‌లో దయాల్ ఆమెను తన కుటుంబానికి పరిచయం చేశాడని.. తన దగ్గర డబ్బు తీసుకున్నాడని.. ఇతర మహిళలతో కూడా ఇలాంటి వ్యవహారం జరిపాడని ఆరోపించింది.
ఈ నెల 14న ఉమెన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది బాధిత మహిళ. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, గాజియాబాద్‌లోని ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరిన ఆమె.. ఈ విషయాన్ని జూలై 21 నాటికి పరిష్కరించాలని కోరింది. ఇక ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ ఫైల్ కాగా.. చాట్, స్క్రీన్‌షాట్‌లు, వీడియో కాల్‌లతో సహా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తరపున 15 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీసిన దయాల్.. ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.






