సౌతాఫ్రికాతో సిరీస్ ఓటమి.. WTC ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి పడిపోయిన భారత్

by Kema Shiva Kumar |

భారత జట్టు దాయాది పాకిస్తాన్ జట్టు కంటే వెనుకబడింది.

సౌతాఫ్రికాతో సిరీస్ ఓటమి.. WTC ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి పడిపోయిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టు దాయాది పాకిస్తాన్ జట్టు కంటే వెనుకబడింది. అవును నిజమే.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో వైట్‌వాష్ అవ్వడంతో ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) పాయింట్ల టేబుల్‌లో ఏకంగా 5వ స్థానానికి పడిపోయింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 రన్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయిన భారత్, ప్రోటీస్ జట్టుకు విజయాన్ని పూలబుట్టలో అప్పగించింది. ఈ తాజా ఫలితంతో రెండుసార్లు WTC ఫైనలిస్ట్ అయిన భారత్, గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కంటే వెనుకబడిపోయింది.

ప్రస్తుతం భారత్ 10 టెస్టులు ఆడి 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, ఐదు ఓడింది. ఒకే ఒక్క మ్యాచ్‌ను డ్రా చేసింది. దీంతో భారత్ పాయింట్ల టేబుల్‌లో విన్నింగ్ పర్సెంటేజ్ 44.44 శాతానికి పడిపోయింది. అయితే, దాయాది పాకిస్తాన్ కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడి (3 గెలుపు, 2 ఓటమి, 1 డ్రా) 52.78 శాతం విన్నింగ్ పర్సెంటేజ్‌తో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా 73.33 శాతం విన్నింగ్ రేటుతో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా 66.67 శాతం, శ్రీలంక 55.56 శాతం, పాకిస్తాన్ 52.78 శాతం, భారత్ 44.44 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌లో భారత్ ప్రదర్శనపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story