- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండర్-19 ఆసియా కప్‌లో సంచలనం.. అభిజ్ఞాన్ వీరోచిత డబుల్ సెంచరీ
దుబాయ్ (Dubai)లోని సెవెన్స్ స్టేడియం వేదికగా ACC అండర్-19 ఆసియా కప్ గ్రూప్ A మ్యాచ్‌లో సంచలనం నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ (Dubai)లోని సెవెన్స్ స్టేడియం వేదికగా ACC అండర్-19 ఆసియా కప్ గ్రూప్ A మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. భారత బ్యాట్స్‌మన్ అభిజ్ఞాన్ కుందు 125 బంతుల్లో డబుల్ సెంచరీ బాదేశారు. మలేసియా (Malaysia) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందు బ్యాటింగ్‌కు దిగింది. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు (Abhigyan Kundu) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి ఏకంగా 209 పరుగులు చేశాడు. ఇందులో దాదాపు 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఈ దెబ్బతో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వేదాంత్ త్రివేది, చివరి ఓవర్లలో కనిష్క్ చౌహాన్‌తో కలిసి అభిజ్ఞాన్ పరుగుల వరద పారించాడు. ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో అభిజ్ఞాన్, చౌహాన్ జోడీ ఏకంగా 29 పరుగులు రాబట్టారు. మరికొద్దిసేపట్లో మలేసియా ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగనున్నారు.






