- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో సంచలనం.. భారత జట్టుకు కాంస్య పతకం
తమిళనాడు వేదికగా జరుగుతున్న హాకీ పురుషుల జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు వేదికగా జరుగుతున్న హాకీ పురుషుల జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన మూడో స్థానం పోరులో అర్జెంటీనాను 4-2 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి భారత్ ఈ ఘనత సాధించింది. సెమీఫైనల్‌లో జర్మనీ చేతిలో 1-5తో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు, కాంస్య పతక పోరులో అద్భుతంగా ఆడింది. మ్యాచ్‌లో భారత్ మొదటి నుంచీ ఆధిపత్యం చెలాయించింది. భారత్ తరపున అరూన్ సాహు 2 గోల్స్, దిల్రాజ్ సింగ్, మన్మీత్ సింగ్ చెరో గోల్ చేశారు. అయితే, ప్రత్యర్థి అర్జెంటీనా రెండు గోల్స్ చేసినా భారత డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్ ధాటికి వారు తట్టుకోలేకపోయారు. ఈ విజయంతో భారత్ జూనియర్ వరల్డ్ కప్‌లో మూడో సారి కాంస్య పతకం సాధించిన ఘనత సొంతం చేసుకుంది. గతంలో 2016, 2023లోనూ కాంస్య పతకం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఫైనల్‌లో జర్మనీ-స్పెయిన్ జట్లు తలపడనున్నాయి.






