- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rohit Sharma: సెలెక్టర్ల ఆ నిర్ణయం వల్లే.. రోహిత్ రిటైర్‌మెంట్?
ఇంగ్లండ్ పర్యటనలో కొత్త కెప్టెన్‌ను నియమించాలని సెలెక్టర్లు ఫిక్సయ్యారు. ఈ కారణంగానే రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు సమాచారం.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సుదీర్ఘ ఫార్మాట్‌కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే అతను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సెలెక్టర్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేసే ముందు రోహిత్‌తో సెలెక్టర్లు మాట్లాడారని, అతన్ని కెప్టెన్‌గా కొనసాగించడానికి వారు అంగీకరించలేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో పరమచెత్త ఫామ్‌లో ఉన్నా కూడా కెప్టెన్ కావడంతో రోహిత్‌ను జట్టులో కొనసాగించాల్సి వచ్చింది.
ఆ సిరీసులో రోహిత్ (Rohit Sharma) కేవలం 6.20 సగటుతో పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే చివరి టెస్టులో తనే తప్పుకున్నాడు. ఇదే పరిస్థితి ఇంగ్లండ్‌లో పునరావృతం అవ్వకూడదని భావించిన సెలెక్టర్లు.. కేవలం బ్యాటర్‌గానే రోహిత్‌ను ఎంపిక చేయాలని, అప్పుడు తను రాణించకపోతే పక్కన పెట్టే అవకాశం ఉంటుందని అనుకున్నారట.
టెస్టుల్లో ఇటీవల రోహిత్ ఫామ్ వల్లనే సెలక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బీసీసీఐకి, రోహిత్‌కి కూడా సెలెక్షన్ ప్యానెల్ స్పష్టం చేసిందట. దీంతో తను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే కరెక్టని భావించిన రోహిత్ (Rohit Sharma).. రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






