- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చాయ్ చేసినంత ఈజీగా’..కోహ్లీ సెంచరీ !
విరాట్ కోహ్లీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు అయితే, విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ

- విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ
- అభినందించిన వీరేంద్ర సెహ్వాగ్
- తొలి వన్డే మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం
దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఆదివారం రోజున భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదిక మొదటి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 17 పరుగులతో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన 52వ సెంచరీ కూడా ఈ మ్యాచ్ సందర్భంగా పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.
దీంతో దేశ వ్యాప్తంగా విరాట్ కోహ్లీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు అయితే, విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంపై వీరేంద్ర సెహ్వాగ్ కూడా రియాక్ట్ అయ్యారు. చాయ్ చేసినంత ఈజీగా పరుగులు చేయగలనని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించినట్లు పేర్కొన్నారు. రికార్డులను విరాట్ కోహ్లీ వెంబడించడం కాదు, ఆ రికార్డులే విరాట్ కోహ్లీని చేజింగ్ చేస్తాయని పేర్కొన్నారు వీరేంద్ర సెహ్వాగ్. అదే విరాట్ కోహ్లీ ఆకలి, ఆవేశం అంటూ వ్యాఖ్యానించారు. కింగ్ ఎప్పటికీ కింగ్ అంటూ కితాబ్ ఇచ్చారు.
వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే కాదు సునీల్ గవాస్కర్, మహమ్మద్ కైఫ్ లాంటి ప్లేయర్లు కూడా స్పందించారు. ది గోట్ అంటూ సునీల్ గవాస్కర్ పేర్కొనగా, ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ మహమ్మద్ కైఫ్ వెల్లడించారు. ఇలా ఉండగా దక్షిణాఫ్రికా తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బాగానే పోరాడింది. కాని చివరకు 49.2 ఓవర్స్ లో 332 పరుగులు మాత్రమే సాధించి ఓడిపోయింది దక్షిణాఫ్రికా.






