సాత్విక్ జోడీ రెండు నెలల తర్వాత.. సింగపూర్ ఓపెన్‌లో బరిలోకి దిగబోతున్న మాజీ వరల్డ్ నం.1 జంట

by Harish |

భారత పురుషుల డబుల్స్ స్టార్ జంట, మాజీ వరల్డ్ నం.1 సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం రెండు నెలల తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టనుంది.

సాత్విక్ జోడీ రెండు నెలల తర్వాత.. సింగపూర్ ఓపెన్‌లో బరిలోకి దిగబోతున్న మాజీ వరల్డ్ నం.1 జంట
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల డబుల్స్ స్టార్ జంట, మాజీ వరల్డ్ నం.1 సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం రెండు నెలల తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టనుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సింగపూర్ ఓపెన్‌‌లో బరిలోకి దిగుతున్నది. ఈ జోడీ చివరిసారిగా మార్చిలో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో ఆడింది. చిరాగ్ వెన్ను నొప్పితో బాధపడటం, సాత్విక్ ఆరోగ్య సమస్యల కారణంగా వీరిద్దరూ రెండు నెలలుగా ఆటకు దూరమయ్యారు. ప్రతిష్టాత్మక సుదర్మీన్ కప్‌ నుంచి కూడా విత్ డ్రా అయ్యారు.

ప్రస్తుతం సాత్విక్, చిరాగ్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించారు. సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన చూంగ్ హోన్ జియాన్-ముహమ్మద్ హైకల్‌ జోడీతో తలపడనుంది. సాత్విక్ జోడీ రాక టోర్నీలో భారత్ బలాన్ని పెంచేదే. మలేసియా మాస్టర్స్‌లో తృటిలో టైటిల్ కోల్పోయిన శ్రీకాంత్ ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్ష్ రజావత్, కిరణ్ జార్జ్ బరిలో ఉన్నారు. ఇక, ఉమెన్స్ సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు పోటీలో ఉండగా ఈ టోర్నీలోనైనా తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నది. తొలి రౌండ్‌లో వెన్ యు జాంగ్‌(కెనడా)ను ఆమె ఎదుర్కోనుంది.


Next Story