మకావ్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ముందంజ

by Phanindra |

మకావ్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ముందంజ వేసింది. మలేసియాకు చెందిన లో హాంగ్ యీ, ఎన్జీ ఎంగ్ చాంగ్‌పై 21-13, 21-15 తేడాతో నెగ్గింది.

మకావ్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ముందంజ
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి మకావ్ ఓపెన్ సూపర్ 300లో రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మలేసియాకు చెందిన లో హాంగ్ యీ, ఎన్జీ ఎంగ్ చాంగ్‌తో జరిగిన 36 నిమిషాలపాటు జరిగిన మ్యాచులో 21-13, 21-15 తేడాతో నెగ్గింది. మహిళల సింగిల్స్‌లో అన్మోల్ ఖార్బ్, తస్నీమ్ మీర్ ఇద్దరూ క్వాలిఫికేషన్ మ్యాచుల్లో నెగ్గి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.

ఇక మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్ తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చైనాకు చెందిన లిన్ షావో మిన్, పెంగ్ యూ వేతో జరిగిన మ్యాచులో 21-16, 20-22, 15-21 తేడాతో జాలీ-గాయత్రి జోడీ ఓటమిపాలైంది.

పురుషుల డబుల్స్‌లో హాంగాంక్‌కు చెందిన లా చూక్ హిమ్, యాంగ్ షింగ్ చో జోడీని 21-18, 21-17 తేడాతో ఓడించిన భారత జంట డింగూ సింగ్ కొంతౌజమ్, అమాన్ మహమ్మద్ కూడా మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్‌ జోడీ తంద్రంగిణీ హేమ నాగేంద్ర బాబు, ప్రియ కొంచెంబం కూడా మెయిన్ డ్రాకు చేరుకున్నారు.

Next Story