- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాత్విక్, చిరాగ్‌లకు ఖేల్ రత్న ప్రదానం
భారత బ్యాడ్మింటన్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు.

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వారికి అత్యున్నత క్రీడా పురస్కారం అందజేశారు. 2023లో సాత్విక్, చిరాగ్ జంట అద్భుత ప్రదర్శన చేసింది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఆ ఏడాది వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నం.1 జోడీగా నిలిచింది. ఈ నేపథ్యంలో సాత్విక్, చిరాగ్ సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం 2023కు సంబంధించి ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వారు హాజరుకాలేదు. ఫిబ్రవరిలో అవార్డు తీసుకోవాల్సి ఉండగా సాత్విక్ తండ్రి మరణించడంతో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. సాత్విక్ మన తెలుగు కుర్రాడే. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం అతని స్వస్థలం.






