టాప్ టెన్‌లోకి సాత్విక్-చిరాగ్ జోడీ రీఎంట్రీ!

by Phanindra |

టాప్ టెన్‌లోకి సాత్విక్-చిరాగ్ జోడీ రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల చైనా ఓపెన్‌లో సెమీస్ వరకు వెళ్లిన జోడీ మూడు స్థానాలు మెరుగుపరచుకొంది.

టాప్ టెన్‌లోకి సాత్విక్-చిరాగ్ జోడీ రీఎంట్రీ!
X

దిశ, స్పోర్ట్స్: బీడబ్ల్యూఎఫ్ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి తిరిగి టాప్ టెన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏసియన్ గేమ్స్ ఛాంపియన్స్ అయిన ఈ జోడీ.. ఇటీవల జరిగిన చైనా ఓపెన్‌ సెమీస్‌లో నిష్క్రమించింది. తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగు పరచుకొని పదో స్థానానికి చేరింది. పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ స్టార్ లక్ష్యసేన్.. 54,442 పాయింట్లతో 17వ ర్యాంకుకు చేరుకున్నాడు.

హెచ్ఎస్ ప్రణయ్ కూడా రెండు స్థానాలు మెరుగై 40,336 పాయింట్లతో 33వ ర్యాంకుకు చేరాడు. మహిళల సింగిల్స్‌లో 17 ఏళ్ల ఉన్నతి హుడా నాలుగు స్థానాలు మెరుగై తన కెరీర్ బెస్ట్ 31వ ర్యాంకుకు చేరుకుంది. స్టార్ షట్లర్ పీవీ సింధు 15వ ర్యాంకులో కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ 11వ ర్యాంకులో ఉండగా.. తనీషా క్రాస్టో-అశ్వినీ పొన్నప్ప జోడీ రెండు స్థానాలు మెరుగై 45వ ర్యాంకుకు చేరుకుంది.

Next Story