- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల డబుల్స్ షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ వరుసగా మరో టోర్నీలో ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ నెలలో హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్‌లో ఓడిపోయిన సాత్విక్ జంట తాజాగా చైనా మాస్టర్స్‌లో కూడా టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించడానికి అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఈ మాజీ వరల్డ్ నం.1 జోడీ 21-17, 21-14 తేడాతో ప్రస్తుత వరల్డ్ నం.1 జంట, మలేసియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్ ద్వయాన్ని ఓడించింది. మలేసియా జంటపై భారత జోడీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేము ఆరంభంలో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనప్పటికీ 13-13 తర్వాత భారత షట్లర్లకు ఎదురులేకుండా పోయింది. ఇక, రెండో గేముa సాత్విక్ జోడీ పూర్తి హవా ప్రదర్శించడంతో 41 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఈ నెలలోనే ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్ జంటపై భారత జోడీకి ఇది రెండో విజయం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడించింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్‌లు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. చైనా మాస్టర్స్‌లో విజేతగా నిలిచి టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూస్తోంది.






